Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin)కు అత్యంత సన్నిహితుడు మెద్వదేవ్.. ఐసీసీపై బెదిరింపులకు దిగారు. ఆ భవనంపై క్షిపణి దూసుకెళ్లడం సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
మాస్కో: క్షిపణులతో దాడి చేయగలమంటూ అంతర్జాతీయ న్యాయస్థానాని(ICC)కి హెచ్చరికలు జారీ చేశారు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్(Dmitry Medvedev). రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin)కు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి.
‘ప్రతి ఒక్కరు భగవంతుడు, క్షిపణులకు జవాబుదారీగా ఉంటారు. ఉత్తర సముద్రంలోని రష్యా నౌక నుంచి హేగ్‌లోని భవనంపైకి హైపర్ సోనిక్ క్షిపణి దాడి ఊహించడం సాధ్యమే’ అంటూ హెచ్చరించారు. ఆకాశాన్ని సునిశితంగా గమనిస్తూ ఉండండి అంటూ జడ్జీలపై బెదిరింపులకు దిగారు. అలాగే ఐసీసీ ఒక దయనీయ అంతర్జాతీయ సంస్థ అంటూ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ ఒకటి నుంచి నో ఐఫోన్స్
2024 అధ్యక్ష ఎన్నికల సన్నాహాల్లో పాలుపంచుకునే అధికారులు మార్చి చివరినాటికి యాపిల్ ఐఫోన్‌లను వాడటం ఆపాలని క్రెమ్లిన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఏప్రిల్ ఒకటి నుంచి తమ ఐఫోన్‌లను మార్చేయాలని స్పష్టం చేసింది. పాశ్చాత్య నిఘా వర్గాలు ఈ పరికరాల నుంచి సమాచారం సేకరించడానికి వీలుండొచ్చనే అంచనాలతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్(Ukraine)లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాల(War Crimes)కు బాధ్యుడిగా పుతిన్(Putin)ను పేర్కొంటూ ఈ వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. అయితే.. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్(Kremlin) ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు.. పుతిన్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు అసాధ్యమని నివేదికలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!