Salman Rushdie: ఒక కంటి చూపు కోల్పోయిన సల్మాన్‌ రష్దీ!

ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన రష్దీ.. ఒక కంటి చూపు కోల్పోయారు. ఒక చేయి పనిచేయకుండా పోయింది.

Published : 24 Oct 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ(Salman Rushdie)పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రష్దీ.. ఒక కంటి చూపు కోల్పోయారు. ఒక చేయి పనిచేయకుండా పోయిందని ఆయన ఏజెంట్ ఒకరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రష్దీ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే, రష్దీ ఇంకా ఆసుపత్రిలో ఉన్నారో లేదో చెప్పేందుకు నిరాకరించారు. ఇలాంటి దాడి జరిగే అవకాశం గురించి తామిద్దరం గతంలో మాట్లాడుకున్నామని, అయితే.. ఈ ఘటన అనుహ్యంగా జరగడంతో ఎవరూ కాపాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆగస్టు 12న అమెరికాలోని న్యూయార్క్‌లో వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతోన్న రష్దీ వద్దకు ఓ వ్యక్తి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. 20 సెకన్ల వ్యవధిలోనే అనేక కత్తిపోట్లు పొడిచారని ప్రత్యక్ష సాక్షి ఒకరు గతంలో వెల్లడించారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన రష్దీని వెంటనే హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. రష్దీ ప్రస్తుత ఆరోగ్య స్థితిపై ఆయన ఏజెంట్‌ మాట్లాడుతూ.. ‘ఆయన శరీరంపై చాలా లోతైన గాయాలయ్యాయి. మెడపై మూడు, ఛాతీపై మరో 15 తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఒక కంటి చూపు కూడా కోల్పోయారు. నరాలు తెగిపోవడంతో ఒక చేయి పనిచేయకుండా పోయింది. ఇది క్రూరమైన దాడి’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని