Travel Ban: సౌదీ ప్రయాణ ఆంక్షలు..భారత్‌ సహా 16 దేశాలు వెళ్లకుండా నిషేధం

కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తగ్గినట్టే తగ్గి, ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్లు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి.

Updated : 23 May 2022 11:58 IST

రియాద్‌: కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తగ్గినట్టే తగ్గి.. ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్లు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి. భారత్‌లో కూడా బీఏ.4. బీఏ.5 ఉత్పరివర్తనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తమ పౌరులు భారత్‌తో సహా పదహారు దేశాలకు వెళ్లకుండా సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆ దేశాల జాబితాలో లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, యెమెన్‌, సోమాలియా, ఇథియోపియా, ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనిజువెలా ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి ఆ తరహా కేసులు తమ దగ్గర నమోదుకాలేదని సౌదీ వెల్లడించింది. ఒకవేళ వాటిని గుర్తించినా..ఆ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు భరోసా ఇచ్చింది. ఇప్పటివరకు 12 దేశాల్లో ఈ మంకీపాక్స్ వెలుగుచూసింది. 92 మందికి ఈ వ్యాధి సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరో 28 అనుమానిత కేసులున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని