Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు
ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు పడింది. ఇరాన్ అధ్యక్షుడిని సౌదీలో పర్యాటించాల్సిందిగా ఆహ్వానం అందింది.
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్(Iran)-సౌదీ అరేబియా(Saudi Arabia) మధ్య చారిత్రాత్మక ఒప్పదం జరిగిన కొన్ని రోజుల్లోనే మరో అడుగు మందుకు పడింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని అధికారికంగా సౌదీలో పర్యటించాలంటూ ఆహ్వానం అందింది. ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ లేఖ అందినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ విషయాన్ని ఇరాన్ సీనియర్ అధికారి మహమ్మద్ జంషాది ట్విటర్లో పేర్కొన్నారు. సౌదీ ఆహ్వానంపై అధ్యక్షుడు రైసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్-సౌదీ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించడానికి అంగీకారం కుదరింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహైన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల కోసం మూడు వేదికలను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
సౌదీలో మహమ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్గత రాజకీయాలతోపాటు దౌత్యనీతిలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పటిదాకా చమురుపై అధికంగా ఆధారపడ్డ తమ దేశాన్ని... మునుముందు అన్నిరంగాల్లోనూ ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని రాజు భావిస్తున్నారు. ఇందుకోసం విజన్-2030 పేరిట ఓ ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలిక ఘర్షణలు, శత్రుత్వాలపట్ల కాసింత మెతకవైఖరి అవలంబించటం అందులో భాగంగా చెబుతున్నారు. అదే ఇరాన్‌తో దౌత్య ఒప్పందానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో చైనా మధ్య వర్తిత్వంతో ఇరాన్ -సౌదీ అరేబియా మధ్య మార్చి రెండో వారంలో ఒప్పందం జరిగింది. పరస్పరం దౌత్యకార్యాలయాలను తెరిచేందుకు అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణ దాదాపు ముగిసినట్లైంది. భవిష్యత్తులో బహ్రెయిన్‌తో కూడా సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని ఇరాన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kishan reddy: రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన: కిషన్‌రెడ్డి
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు
-
Crime News
Nellore: గుంతలో పడిన ఇద్దరు పిల్లలను కాపాడి.. తల్లులు మృతి
-
Sports News
MS Dhoni: త్వరలో ఆస్పత్రిలో చేరనున్న ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
-
Sports News
సెల్ఫీ అడిగిన వ్యక్తినే పెళ్లాడనున్న స్టార్ ప్లేయర్..!
-
India News
Char Dham: చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. ఉత్తరాఖండ్ పోలీసుల కీలక సూచన