US Embassy: రష్యాను వీడండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక!

మాస్కోలోని అమెరికా(America) రాయబార కార్యాలయం.. రష్యా(Russia)లో నివసిస్తోన్న అమెరికన్లను వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ హెచ్చరించింది. రష్యా విషయంలో అనేక అంశాలు ఇప్పటికే...

Published : 30 Sep 2022 01:13 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై దాడులను తీవ్రతరం చేసేందుకు.. మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ(Military mobilisation)కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కోలోని అమెరికా(America) రాయబార కార్యాలయం.. రష్యా(Russia)లో నివసిస్తోన్న అమెరికన్లను వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ అమెరికా హెచ్చరించింది. రష్యా విషయంలో అనేక అంశాలు ఇప్పటికే సవాల్‌గా మారాయని తాజాగా పేర్కొంది.

‘ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న పౌరుల విషయంలో అమెరికా జాతీయతను గుర్తించేందుకు రష్యా నిరాకరించవచ్చు. యూఎస్ కాన్సులర్ సహాయం పొందే అవకాశాన్ని తిరస్కరించవచ్చు. రష్యా నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుని, సైనిక సేవల కోసం నిర్బంధించవచ్చు. ఈ నేపథ్యంలో.. ఇక్కడ నివసిస్తోన్న, పర్యటిస్తోన్న అమెరికన్లు వెంటనే బయల్దేరాలి. రవాణా సౌకర్యాలు పరిమితంగా మారే అవకాశం ఉంది’ అని అమెరికన్‌ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. పుతిన్‌ జారీ చేసిన సైనిక సమీకరణ ఉత్తర్వులతో స్థానిక కుటుంబాలు కలవరం చెందుతున్నాయి. దీన్ని తప్పించుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. దీంతో రష్యా నుంచి వెళ్లే విమానాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా పొరుగు దేశాలైన జార్జియా, ఫిన్లాండ్‌తోపాటు వీసా అవసరం లేని అర్మేనియా, టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలకు క్యూ కడుతున్నారు. సరిహద్దు చెక్‌పాయింట్లూ రద్దీగా మారాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని