Ukraine Crisis: రష్యా దాడుల్లో ఏడుగురు పౌరుల మృతి

ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దళాలు చేస్తున్న దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కీలక  నగరమైన ఒడిసా శివార్లలోని పొడిల్స్క్‌ సైనిక స్థావరంపై జ

Published : 24 Feb 2022 14:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దళాలు చేస్తున్న దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కీలక  నగరమైన ఒడిసా శివార్లలోని పొడిల్స్క్‌ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. మొత్తం 19 మంది ఆచూకీ గల్లంతైంది. ఇక మరియుపోల్‌ నగరంపై జరిగిన దాడిలో ఒక వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. 

వివిధ ప్రాంతాల్లో సరిహద్దులను దాటి రష్యా వాహనాలు ఉక్రెయిన్‌లో ప్రవేశించినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు వైపు డాన్‌బాస్‌ ప్రాంతంలోని ఖర్కీవ్‌, లుహాన్స్క్‌ ప్రాంతం నుంచి.. ఉత్తరం వైపు బెలారస్‌ వద్ద, దక్షిణం వైపు క్రిమియా నుంచి రష్యా దళాలు చొచ్చుకొస్తున్నాయి. సైనిక వాహనాలు చొచ్చుకురావడానికి ముందు శతఘ్నులతో భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. 

భారీ ఆంక్షలకు రంగం సిద్ధం..

రష్యాపై ఐరోపా సమాఖ్య భారీ అంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ఐరోపా సమాఖ్య చీఫ్‌ ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ వెల్లడించారు. ఐరోపా సమాఖ్య నాయకులు నేడు రష్యాపై విధించిన భారీ ఆంక్షల ప్రతిపాదనలను ఐరోపా సభ ఆమోదానికి ప్రతిపాదిస్తారని ఆమె పేర్కొన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మక రంగాలను లక్ష్యంగా చేసుకొని ఆంక్షలు విధిస్తామని వెల్లడించారు. తాము రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఆధునికీకరణను (సైనిక)ను అడ్డుకొంటామన్నారు. దీనికి అదనంగా ఐరోపా సమాఖ్య దేశాల్లోని రష్యా ఆస్తులను స్తంభింపజేస్తామన్నారు. దీంతోపాటు రష్యా బ్యాంకులను ఐరోపా ఆర్థిక మార్కెట్లలోకి అడుగుపెట్టనీయమని వెల్లడించారు. మరోపక్క రష్యా కనీవినీ ఎరుగని రీతిలో ఆంక్షలను ఎదుర్కోబోతోందని యూకే విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు