Jerusalem shooting: జెరూసలెంలో కాల్పులు.. పలువురికి గాయాలు..

ఇజ్రాయెల్‌లో అత్యంత  పవిత్ర స్థలమైన జెరూసలెంలో కాల్పులు చోటు చేసుకొన్నాయి. దుండగులు గుడ్డిగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంత్యంత పవిత్రమై వెస్టర్న్‌

Published : 14 Aug 2022 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌లో అత్యంత  పవిత్ర స్థలమైన జెరూసలెంలో కాల్పులు చోటు చేసుకొన్నాయి. దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంత్యంత పవిత్రమైన వెస్టర్న్‌ వాల్‌ సమీపంలో నిలిపి ఉంచిన కారు నుంచి ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడి తర్వాత దుండగులు పరారయ్యారు. భద్రతా సిబ్బంది వారి కోసం వేట మొదలుపెట్టారు. దీనిని ఉగ్ర దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

దుండగులు బస్సు కోసం వేచి ఉండి మరీ కాల్పులు జరిపినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’ కథనంలో పేర్కొంది. ఈ బస్సు పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఈ బస్సు కింగ్‌ డేవిడ్‌ సమాధి వద్ద ఆగగానే కాల్పులు మొదలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన చాలా మందికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం ఇద్దరు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు యాత్రికులు వెస్టర్న్‌వాల్‌ వైపు వెళ్లకుండా తాత్కాలికంగా పోలీసులు అడ్డుకొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని