Pakistan: షాకింగ్‌.. ఆస్పత్రి పైభాగంలో గుట్టలకొద్దీ మృతదేహాలు..!

ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ముల్తాన్‌లోని నిష్తార్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆస్పత్రి మార్చురీ పైభాగంలో మృతదేహాలను గుర్తించారు.

Published : 15 Oct 2022 14:58 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పైభాగంలో కుళ్లిన దశలో ఉన్న గుట్టలకొద్దీ శవాలు బయటపడ్డాయి. వాటి సంఖ్య వందల్లో ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.

ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ముల్తాన్‌లోని నిష్తార్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆస్పత్రి మార్చురీ పైభాగంలో ఈ మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి కమిటీని నియమించారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.  శవాలకు వెంటనే అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఈ వార్తలపై నిష్తార్‌ వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ మరియం అషార్ఫ్‌ స్పందించారు. ‘పోలీసు విభాగం  గుర్తుతెలియని మృతదేహాలను విశ్వవిద్యాలయానికి అప్పగించింది. విద్యార్థులు వైద్యపరమైన పరీక్షలు నిర్వహించేందుకు వీటిని వినియోగిస్తారు. ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగింది’ అని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. దీనిపై బలూచ్‌ వేర్పాటువాదులు స్పందించారు. ఇవి కనిపించకుండా పోయిన తమవారి మృతదేహాలు కావొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని