Published : 03 Apr 2022 15:16 IST

COVID: నగర ప్రజలు మొత్తం కొవిడ్‌ పరీక్షలు చేసుకోండి

ఇంటర్నెట్‌డెస్క్‌:  చైనా జీరోకోవిడ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలో భాగంగా షాంఘై నగరవాసులు మొత్తం సొంతంగా కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని ఆదివారం ఆదేశించింది. దీంతో ఆ నగరంలోని దాదాపు 2.6 కోట్ల మంది ఇప్పుడు యాంటీజెన్‌ కిట్లను వాడి స్వయంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోనున్నారు. ఈ విషయాన్ని షాంఘైలోని ప్రభుత్వ అధికారి ఒకరు ధ్రువీకరిస్తూ ‘‘సోమవారం నగర వాసులు మొత్తం న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసుకోనున్నారు. వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రధానంగా కేసులు ఎక్కువ ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది’’ అని తెలిపారు.

ప్రస్తుతం చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘై పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంది. తొలుత తూర్పు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించిన ప్రభుత్వం ఆ తర్వాత నగరం మొత్తానికి ఈ ఆంక్షలను విస్తరించింది. ఈ నగరంలో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోపక్క భారీ జనాభా ఉండటంతో పరీక్షలు నిర్వహించడం శక్తికి మించిన భారంగా మారింది. 

షాంఘైలో వస్తున్న ఇన్ఫెక్షన్లు మొత్తం అసిమ్టమాటిక్ కేసులు కావడం గమనార్హం. కానీ, చైనా డైనమిక్‌ క్లియరెన్స్‌ విధానంలో  అవసరమైన వారిని గుర్తించి, పరీక్షించి, క్వారటైన్‌కు తరలిస్తున్నారు. ఒక్క ఆదివారమే షాంఘైలో మొత్తం 7,788 కేసుల్లో లక్షణాలు లేని కేసులగా గుర్తించారు. అంతకు ముందు రోజు ఇక్కడ 6,501 కేసులు వచ్చాయి. చైనాలో వస్తున్న రోజువారీ కేసుల్లో షాంఘై నుంచి వచ్చేవే  అత్యధికంగా ఉంటున్నాయి.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని