Covid: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ పొడిగింపు..!

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ను నేడు మరోసారి పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ సారి నగరంలోని 2.5 కోట్ల మంది జనాభా మొత్తం కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 05 Apr 2022 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ను నేడు మరోసారి పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ సారి నగరంలోని 2.5 కోట్ల మంది జనాభా మొత్తం కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో  తీవ్ర ఆంక్షలు విధించారు. కానీ, తాజాగా నగరం మొత్తం కఠిన ఆంక్షలను విధించారు. కానీ, తాజా నిర్ణయం నగరం మొత్తానికి వర్తించనుంది. చైనా ఆర్థిక రాజధానిగా పేరున్న ఈ నగరంపై కరోనా వైరస్‌ పంజా విసరడంతో రోజువారీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. దీంతో ఇక్కడి వారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకొంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు ఆన్‌లైన్‌లోనే ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

షాంఘైలో వైరస్‌ వ్యాప్తి చైనా జీరోకోవిడ్‌ వ్యూహాం సత్తాను పరీక్షిస్తోంది. వైరస్‌ వ్యాప్తి పెరిగే కొద్దీ నిబంధనలు కఠినంగా మారుతుండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా దేశాలు అనుసరిస్తున్న వాస్తవిక దృక్పథానికి భిన్నంగా చైనా జీరోకోవిడ్‌ పాలసీని ఎంచుకొంది. కానీ, ఒమిక్రాన్‌ వేరియంట్‌ తేలిగ్గా వ్యాపిస్తుండటంతో వైరస్‌ కట్టడిలోకి రావడంలేదు. ప్రస్తుతం నగరంలో వైరస్‌ను కట్టడి చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని