
UAE President: యూఏఈ అధ్యక్షుడిగా షేక్ అల్ నహ్యాన్
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా కొనసాగిన షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ మృతి అనంతరం తాజాగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ అల్ నహ్యాన్ పాలకుడిగా నియమితులయినట్టు అక్కడి అధికార మీడియా వెల్లడించింది. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా ఆయన నియామకం జరిగినట్లు డబ్ల్యూఏఎం వార్తాసంస్థ తెలిపింది. 1971 నుంచీ యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగిన షేక్ జయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ కుమారుడే షేక్ అల్ నహ్యాన్. షేక్ ఖలీఫాకు సోదరుడు.
యూఏఈ అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. షేక్ ఖలీఫా మృతితో యూఏఈ అధ్యక్ష వ్యవహారాలశాఖ 40 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు శుక్రవారం నుంచి మూడు రోజులు మూసి ఉంటాయని తెలిపింది. షేక్ ఖలీఫా మృతి గౌరవార్థం భారత ప్రభుత్వం సైతం శనివారం ఒక్కరోజు సంతాప దినంగా ప్రకటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్
-
World News
Zimbabwe: త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!
-
Politics News
Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
World News
Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
-
Business News
Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య