America : అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు..
కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.
కాలిఫోర్నియా : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకీ మోత మోగింది. ఓ గురుద్వారాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో జరిగిందీ ఘటన. దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. అయితే జాతి విద్వేష ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు.
ఇదిలా ఉండగా.. ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు భారత్‌లో ముమ్మర ప్రయత్నాలు జరుగుతుండగా.. పలు దేశాల్లో ఖలిస్థానీ అనుకూలవాదులు ఆందోళనలకు దిగుతున్న విషయం తెలసిందే. అమెరికాలోనూ ఈ ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయంపై దాడి చేసేందుకు ఖలిస్థానీ అనుకూలవాదులు విఫల యత్నం చేసిన విషయం తెలిసిందేే. ఈ పరిణామాల వేళ.. ఇప్పుడు గురుద్వారాలో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు