Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంపై కిమ్(Kim) సోదరి స్పందించారు. తాము రష్యావైపు ఉంటామని వెల్లడించారు. 

Published : 28 Jan 2023 19:31 IST

ప్యాంగ్యాంగ్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా జరుపుతోన్న దురాక్రమణపై ఉత్తర కొరియా(North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది రష్యా పక్షమేనని వెల్లడించారు. 

తాము రష్యా(Russia) సైన్యం, ప్రజల పక్షానే నిల్చుంటామని కిమ్(Kim) సోదరి కిమ్‌ యో జోంగ్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో తమ మద్దతు పుతిన్‌ ప్రభుత్వానికేనన్నారు. ‘రష్యా ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు దృఢంగా నిలబడ్డారు. ఉక్రెయిన్‌కు అబ్రామ్స్‌ ట్యాంకులను అందించాలని అమెరికా నిర్ణయం తీసుకోవడం చాలా నీచమైంది. మాస్కో నగరాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో అమెరికా ముందుకెళ్తోంది. అయితే రష్యా చేతిలో అమెరికా, పశ్చిమ దేశాల ఆయుధాలు ముక్కలుగా మారిపోతాయనే దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు’ అని ఆమె అమెరికా, దాని మిత్ర దేశాలపై ఘాటుగా స్పందించారు. ఈమేరకు అక్కడి ఉత్తర కొరియా మీడియా సంస్థ వెల్లడించింది. 

పుతిన్ ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌నకు ఉత్తర కొరియా ఆయుధాలు అందిస్తోందని ఇటీవల అమెరికా ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ అత్యాధునిక ఆయుధాలు పంపేందుకు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో యుద్ధం మరింత తీవ్రరూపు దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు