Iran protests: సోదరుడి అంత్యక్రియల్లో జుట్టును కత్తిరించుకొని..!

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఆందోళనల్లో

Published : 27 Sep 2022 01:47 IST

* ఇరాన్‌లో హిజాబ్‌ ఆందోళనల్లో ఓ యవతి నిరసన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ ఆందోళనల్లో దేశవ్యాప్తంగా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఆందోళనల్లో మరణించిన ఓ యువకుడి అంత్యక్రియల్లో అతడి సోదరి నిరసన తెలిపిన వీడియో వైరల్‌గా మారింది. జావెద్‌ హైదరీ అనే యువకుడు ఉద్యమం సందర్భంగా ప్రాణాలు కోల్పోయాడు. జావెద్‌ అంత్యక్రియల సమయంలో అతడి సోదరి  విలపించింది. ఒక దశలో ఆమె తన జట్టును కత్తిరించి జావెద్‌ మృతదేహంపై పడవేసింది. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది. 

ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలోకి తీసుకొని హింసించడంతో మరణించింది. కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. చాలా మంది మహిళలు ఇరాన్‌లోని చట్టాలను వ్యతిరేకిస్తూ తమ జట్టును కత్తిరించుకొంటున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చాలా మంది నిరసనల్లో హిజాబ్‌లను మంటల్లోకి విసురుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని