Hajj Pilgrims: చనిపోయిన హజ్‌ యాత్రికుల్లో 90 మంది భారతీయులు?

Hajj Pilgrims: సౌదీలో ఎండల ధాటికి ఈసారి హజ్‌ యాత్రలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

Published : 20 Jun 2024 09:50 IST

మక్కా: తీవ్ర ఎండ, వేడిగాలులతో ఈ ఏడాది హజ్ యాత్రికులు (Hajj Pilgrims) పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 650మంది వరకు మరణించి ఉంటారని అధికారిక వర్గాలు అంచనా వేశాయి. వీరిలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు ఓ దౌత్యాధికారిని ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై అటు సౌదీగానీ, ఇటు భారత ప్రభుత్వంగానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయిదు రోజుల హజ్‌ (Hajj) యాత్రలో కనీసం 650 మంది మృతి చెందినట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. యాత్రికుల మరణాల మొత్తం సంఖ్యపై ప్రభుత్వపరంగా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జోర్డాన్, టునీసియా వంటి కొన్ని దేశాలు తమ యాత్రికుల మరణాలను ధ్రువీకరిస్తూ ప్రకటనలు చేశాయి. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన 320 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్‌ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉంటారని సౌదీ హజ్‌ అధికార యంత్రాంగం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని