viral news: విమానం బిజినెస్‌ క్లాస్‌లో పాము..!

అమెరికాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వెళ్లే యునైటెడ్‌ ఫ్లైట్‌ 2038లో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణికులు పామును గుర్తించారు.

Updated : 19 Oct 2022 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విమానంలో విలాసవంతమైన బిజినెస్‌ క్లాస్‌లోకి ఓ పాము దూరి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. అమెరికాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వెళ్లే యునైటెడ్‌ ఫ్లైట్‌ 2038లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విమానం ప్రయాణం ముగించుకొని ల్యాండ్‌ అయిన సమయంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణికులు పామును గుర్తించారు. దీంతో ఒక్కసారిగా వారు గగ్గోలు పెట్టారు. వెంటనే న్యూజెర్సీలోని న్యూఆర్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో  సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకొని పామును పట్టుకొని అడవిలోకి వదిలేశారు. విమానంలో మరేమైనా జీవులు ఉన్నాయేమో అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

విమానంలో ఉన్న పామును కామన్‌ గ్రేటర్‌ స్నేక్‌గా గుర్తించారు. ఇది ఫ్లోరిడాలో విస్తృతంగా కనిపిస్తుంది. దీనిలో విషం ఉండదు. మనుషులపై దాడులకు కూడా ప్రయత్నించదని వన్యప్రాణి నిపుణులు వెల్లడించారు. 

విమానాల్లో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో మలేషియాలోని ఎయిర్‌ ఏషియా విమానంలో ప్రయాణికుడిపై ఉన్న లైటులో పాము కనిపించింది.  ఈ పామును గుర్తించిన సమయంలో ఆ విమానం గాల్లో ప్రయాణిస్తోంది. అప్పట్లో ఈ పాము వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. ఇక 2016లో ఎయిర్‌ మెక్సికో విమానంలో గ్రీన్‌ వైపర్‌ జాతికి చెందిన పాము దర్శనమిచ్చి ప్రయాణికులను హడలగొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని