రాకెట్ లాంఛర్‌ శకలంతో ఆడుతుంటే పేలిపోయి.. చిన్నారులు మృతి

Explosion: చిన్నారుల అమాయకత్వం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాకెట్ లాంఛర్ శకలం పేలిపోవడంతో చిన్నారులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

Published : 27 Sep 2023 16:17 IST

ఇస్లామాబాద్‌: అనుకోని ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. పిల్లలు ఆడుకుంటూ ఇంట్లోకి తెచ్చిన రాకెట్‌ లాంఛర్ శకలం పేలిపోవడంతో(Explosion) తొమ్మిది మంది మృతి చెందారు. వారిలో నలుగులు చిన్నారులు ఉన్నారు. పాకిస్థాన్‌(Pakistan)లోని సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన కాంద్‌కోట్‌లో బుధవారం ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.

పిల్లలు ఇంటి బయటఆడుకుంటుండగా.. రాకెట్ లాంఛర్ శకలం వారి కంటపడింది. వారు దానిని ఇంటికి తీసుకొచ్చి ఆడుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో నలుగురు చిన్నారులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే స్థానిక ఆసుపత్రి వద్ద ఎమర్జెన్సీ ప్రకటించారు.

నిజ్జర్ హత్య వెనుక పాక్‌ ఐఎస్‌ఐ..!

ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సింధ్‌ ముఖ్యమంత్రి.. వెంటనే విచారణకు ఆదేశించారు. ఆ ఇంటివద్దకు రాకెట్ శకలం ఎలా వచ్చిందన్న దానిపై నివేదిక సమర్పించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని