South Africa: రామఫోసా పదవిని వీడరు..!

రాజీనామా చేయకూడదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా నిర్ణయించుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి పేర్కొన్నారు.  

Published : 04 Dec 2022 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన దక్షిణాఫ్రికా అధ్యక్షడు సిరిల్‌ రామఫోసా పదవిని వీడనని తేల్చిచెప్పారు. ఆయన అధికారిక ప్రతినిధి నేడు వివరణ ఇస్తూ.. ఆయనపై వస్తున్న ఆరోపణలపై పోరాడతారేగానీ పారిపోరని పేర్కొన్నారు. అంతేకాదు.. రెండోసారి ఆఫ్రికా నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని కోరతారని కూడా వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలిక మనుగడ, ప్రయోజనాల దృష్ట్యా ఆ తప్పుడు నివేదికలను సవాలు చేస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై దర్యాప్తు చేసిన న్యాయనిపుణుల బృందం రామఫోసాను సమాధానం చెప్పాలని పేర్కొంది.

2020 ఫిబ్రవరి 9న దక్షిణాఫ్రికాలోని లింపూపూ ప్రావిన్స్‌లోని రామఫోసాకు ఫలాఫలా వైల్డ్‌లైఫ్‌ ఫామ్‌ ఉంది. అక్కడి ఫర్నీచర్‌లో లక్షల డాలర్లను దాచిపెట్టారు. వాటిని కొందరు దుండగులు అపహరించారు. వారిలో కొందరు దేశం దాటేశారు. రామఫోసా భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని విచారించి కొంత సొమ్ము స్వాధీనం చేసుకొన్నారు. దీంతోపాటు ఈ విషయాలు ఎక్కడా ప్రస్తావించకుండా ఆ దొంగలకు ఎదురు చెల్లింపులు చేశారు. ఈ విషయంపై సౌతాఫ్రికన్‌ స్టేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్‌ ఫ్రాసెర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్యానల్‌ రామఫోసా తీరును తప్పుపట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని