North Korea: పోటాపోటీగా క్షిపణి పరీక్షలు..!

కొరియా ద్వీపకల్పం క్షిపణి ప్రయోగాలతో దద్దరిల్లుతోంది. ఉత్తర కొరియా ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన 24 గంటల్లోనే దానికి తగిన ప్రతిస్పందన వచ్చింది.

Published : 06 Jun 2022 21:55 IST

 అమెరికా, ద.కొరియాల సంయుక్త బలప్రదర్శన

ఇంటర్నెట్‌డెస్క్‌: కొరియా ద్వీపకల్పం క్షిపణి ప్రయోగాలతో దద్దరిల్లుతోంది. ఉత్తర కొరియా ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన 24 గంటల్లోనే దానికి తగిన ప్రతిస్పందన వచ్చింది. దక్షిణ కొరియా, అమెరికా కలిసి సోమవారం క్షిపణులను ప్రయోగించాయి. తెల్లవారుజామున ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌ నుంచి అమెరికా ఒకటి, ద.కొరియా ఏడు క్షిపణులను చొప్పున ప్రయోగించాయి.  

దక్షిణ కొరియా వార్‌మెమోరియల్‌ వద్ద అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉ.కొరియా కవ్వింపు చర్యలకు తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని తెలిపారు. ‘‘మా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు కొంచెం కూడా నష్టం వాటిల్లనీయమని కచ్చితంగా చెబుతున్నాను’’ అని యూన్‌ సుక్‌ పేర్కొన్నారు. ఉ.కొరియా అణ్వస్త్రాలు, క్షిపణలు కేవలం కొరియా ద్వీపకల్పానికేకాదు.. ఈశాన్య ఆసియా మొత్తానికి ముప్పుగా మారాయి అని వ్యాఖ్యానించారు. 

దక్షిణ కొరియా, అమెరికా తరచూ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తుండటం ఉ.కొరియాకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఆయుధ పరీక్షలు చేపడుతోంది. ఇటీవల కాలంలో ద.కొరియా వీటికి ప్రతిస్పందన పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్‌ బాధ్యతలు చేపట్టాక ఆ దేశ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉ.కొరియా విషయంలో కఠిన వైఖరిని అవలంభిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని