Canada: కెనడాతో అదే సమస్య - జీ7 సదస్సు వేళ భారత్‌ ఆందోళన

తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్‌ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పించడమే కెనడాతో ఉన్న ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది.

Published : 13 Jun 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్‌ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తూనే ఉందని.. ఆ దేశంతో అదే ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది. ఈ విషయంపై భారత్‌ పదే పదే ఆందోళనను వ్యక్తం చేస్తోందని.. అటువంటి శక్తులపై ట్రూడో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. ఇటలీలో జరగనున్న జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్న వేళ.. భారత విదేశాంగ ఈ విధంగా వ్యాఖ్యానించింది.

‘‘ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని యావత్‌ ప్రపంచం కళ్లారా చూసింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేయాలనే దాని గురించి ఎవరో వ్యాఖ్యానించడాన్ని పట్టించుకోము’’ అని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా పేర్కొన్నారు. భారత్‌-కెనడా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల పెరుగుదల గురించి జస్టిన్‌ ట్రూడో ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు వినయ్‌ క్వాత్రా ఈ విధంగా స్పందించారు.

రష్యాపై ఒత్తిడి తెస్తున్నాం..

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను సాధ్యమైనంత తొందరగా, క్షేమంగా స్వదేశానికి పంపించడంపై మాస్కోపై ఒత్తిడి తెస్తున్నామని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా వెల్లడించారు. ఇటీవల మరో ఇద్దరు భారతీయులు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించిన ఆయన.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నాలుగుకు చేరిందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. భారతీయులను రష్యా సైన్యంలో చేర్చుకోవడాన్ని నిలిపివేయాలని మాస్కోను డిమాండ్‌ చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు