SpaceX: నేలరాలిన స్పేస్ఎక్స్ ఉపగ్రహాలు..!
స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు కొన్ని భూమిపై కుప్పకూలాయి. ఇంటర్నెట్ అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన స్టార్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇటీవల మొత్తం 49 ఉపగ్రహాలను ప్రయోగించింది.
వైరల్‌గా మారిన వీడియో
ఇంటర్నెట్‌డెస్క్: స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు కొన్ని అంతరిక్షం నుంచి భూమిపై కుప్పకూలాయి. ఇంటర్నెట్ అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన స్టార్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల మొత్తం 49 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇటీవల శక్తివంతమైన సౌరతుపాను తాకడంతో 40 ఉపగ్రహాలు కక్ష్యను తప్పాయి. వీటిల్లో కొన్ని భూవాతావరణంలోకి ప్రవేశించి కుప్పకూలాయి. ప్రముఖ స్పేస్ జర్నలిస్టు జొనాథన్ ఒ’కల్లిఘాన్ ట్వీట్ చేశారు. ఈ దృశ్యాలను ప్యూర్టో రికోకు చెందిన ఆస్ట్రోనోమియా డెల్ కెర్బి అనే సంస్థ చిత్రీకరించింది.
అతిపెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు సౌరతుపాను ప్రభావానికి గురై గతి తప్పిన ఘటన ఇదే కావచ్చని హార్వర్డు-స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పేస్ఎక్స్ సంస్థ వెబ్సైట్లో స్పందించింది. ఈ ఉపగ్రహాలను ప్రయోగించిన మర్నాడే సౌరతుపాను ప్రభావానికి గురైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంతో స్టార్ లింక్ ప్రాజెక్టుకు పెద్దగా ప్రమాదంలేదని వెల్లడించింది. ప్రయోగఖర్చుతో సహా కలిపి మొత్తం 100 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా. వాస్తవానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ రాకెట్‌ను ప్రయోగించడానికి ముందే అమెరికా అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం హెచ్చరించింది. ఫిబ్రవరి 2-3 తేదీల్లో సౌరతుపాను ఉండే అవకాశం ఉందని గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!