Sri Lanka: కరెన్సీ ముద్రణ నిలిపే దిశగా శ్రీలంక
ఇంటర్నెట్డెస్క్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇప్పుడు ద్రవ్యోల్బణం మరో సమస్యగా తయారైంది. ఇప్పటికే ఇక్కడ ఇంధన కొనుగోళ్లకు అవసరమైన డాలర్లు అయిపోయాయి. కానీ, స్థానిక ఉద్యోగులకు జీతాలు, ఇతర ప్రభుత్వ ఖర్చుల కోసం కరెన్సీ ముద్రణ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం భారీగా పెరిగి 60శాతానికి చేరడంతో దీనిని కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొంది. ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశం ఇదే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి నగదును చొప్పించడం ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికోసం కొత్తగా కరెన్సీ ముద్రణను నిలపాల్సి వస్తుంది.
శ్రీలంక దివాలా అంచుకు చేరడంతో బెయిలౌట్ కోసం ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)తో జరుగుతున్న చర్చలు కఠినంగా సాగుతున్నాయి. మంగళవారం ప్రధాని రణీల్ విక్రమ సింఘే పార్లమెంట్లో మాట్లాడుతూ దేశ ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ చర్చలు స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్స్థాయికి చేరాలన్నా ఆగస్టు వరకు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకలో వినిమయ వస్తువల ధరలు 58 శాతం, రవాణా ధరలు 120 శాతం, ఆహార ధరలు 80 శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికలో శ్రీలంక 588 బిలియన్ రూపాయలను ముద్రించింది. జనవరి 2020 నుంచి చూస్తే శ్రీలంక 2.3 ట్రిలియన్ రూపాయలను ముద్రించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
Serena William: టెన్నిస్కు దూరంగా ఉండాలనుకుంటున్నా: సెరీనా విలియమ్స్
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?