Sri Lanka: శ్రీలంక కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌ రాజీనామా

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరేకొద్దీ కీలక అధికారులు, మంత్రులు పదవుల నుంచి వైదొలగుతున్నారు. తాజాగా శ్రీలంక కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కూడా

Published : 05 Apr 2022 02:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరేకొద్దీ కీలక అధికారులు, మంత్రులు పదవుల నుంచి వైదొలగుతున్నారు. తాజాగా శ్రీలంక కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. రేపు ఈ బ్యాంక్‌ వడ్డీరేట్లను నిర్ణయించాల్సి ఉంది. ఆ సమయంలో బ్యాంక్‌ గవర్నర్‌ రాజీనామా చేయడం గమనార్హం. ఇప్పటికే ప్రజలు ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అజిత్‌ రాజీనామాకు శ్రీలంక మార్కెట్లు సానుకూలంగా స్పందించడం విశేషం. ప్రస్తుతం శ్రీలంకలోని 22 మిలియన్ల మంది ప్రజలు 1948 తర్వాత తొలిసారి ఈ స్థాయి ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నారు. 

దేశంలో విదేశీ మారకద్ర్యం కొరత తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం దిగుమతులకు చెల్లింపులు చేయలేకపోతోంది. దీంతోపాటు ఇంధనం కొనుగోలుకు కూడా డబ్బులు లేవు. తాజాగా గవర్నర్‌ రాజీనామా చేసినా.. వడ్డీ రేట్ల నిర్ణయం ప్రకటన షెడ్యూల్‌లో ఏ మాత్రం మార్పులేదని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల నుంచి శ్రీలంక రూపాయి విలువ దాదాపు 30శాతం కోల్పోయింది. రోజువారీ 13 గంటలపాటు విద్యుత్తు కోత విధించడంతో ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని