Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా

ప్రజాగ్రహానికి గురై దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు తన పదివికి రాజీనామా చేశారు.

Updated : 14 Jul 2022 20:02 IST

కొలంబో: ప్రజాగ్రహానికి గురై దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు వెళ్లిన అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన శ్రీలంక పార్లమెంట్‌ స్పీకర్‌ మహింద అభయవర్ధన.. రాజీనామా లేఖ అందినట్లు వెల్లడించారు. మరోవైపు గొటబాయ రాజీనామా చేశారనే వార్త వినగానే శ్రీలంకలో సంబరాలు మొదలయ్యాయి.

ఆర్థికంగా, రాజకీయంగా కుదేలైన శ్రీలంక నిరసనలతో అట్టుడుకుతోంది. అధ్యక్ష భవనంతోపాటు ప్రధాని నివాసంపై దాడి చేసిన ఆందోళనకారులు.. అధ్యక్షుడు, ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఉన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాత్రం మాల్దీవులకు పారిపోయారు. అక్కడ కూడా నిరసనలు మొదలు కావడంతో తాజాగా ఆయన సింగపూర్‌కు వెళ్లిపోయారు. అయితే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సమయంలో బుధవారం నాడు రాజీనామా చేస్తానని తొలుత ప్రకటించారు. కానీ, ఆయన చెప్పినట్లు చేయలేదు. ఇదే సమయంలో శ్రీలంకలో అత్యయిక స్థితి ప్రకటించడంతోపాటు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూను విధించారు. ఇలా పరిస్థితులు చేయిదాటిపోతోన్న సమయంలో శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గొటబాయ  ప్రకటించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని