
Sri Lanka Crisis: శ్రీలంక ఎంపీది ఆత్మహత్య కాదు.. హత్యే..!
ఆందోళనకారుల దాడిలో మరణించారన్న పోలీసులు
కొలంబో: శ్రీలంకలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనల్లో అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలుత ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించినప్పటికీ అది హత్యేనని శ్రీలంక పోలీసులు తేల్చారు. ఇద్దరు ఆందోళనకారులపై తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం ఎంపీ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుకున్నప్పటికీ.. ఆందోళనకారుల చేతుల్లోనే హత్యకు గురైనట్లు నిర్ధారించామన్నారు.
‘సోమవారం జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన ఎంపీ వాస్తవంగా హత్యకు గురయ్యారు. తనను తాను కాల్చుకోలేదు. ఆందోళనకారుల చేతిలో చనిపోయారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనను పట్టుకొని తీవ్రంగా కొట్టారు. దాంతో ఎంపీ ప్రాణాలు కోల్పోయారు’ అని పోలీస్ అధికార ప్రతినిధి నిహాల్ థాల్‌దువా పేర్కొన్నారు. ఎంపీతో సహా తొమ్మిదిమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఘర్షణలపై దర్యాప్తు జరపాలని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే ఆదేశాలు జారీచేశారన్నారు.
ఇదిలా ఉంటే, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంకలో గత వారం రోజులుగా నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. ప్రధానమంత్రి మహీంద రాజపక్స మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య సోమవారం నాడు జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో నిట్టంబువ పట్టణంలో అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు అమరకీర్తి అథూకోరలా (57) కారును ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారిపై ఆయన తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘనటలో ఇద్దరు ఆందోళనకారులు మృత్యువాతపడ్డారు. తిరగబడిన ఆందోళనకారులు ఎంపీని పట్టుకొని దాడి చేయడంతో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Breast cancer: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేదెలా తెలుసుకోండి
-
General News
CM Jagan: ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యం కావాలని ఏపీ సర్కారు నిర్ణయం
-
India News
Kerala: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేరళ మంత్రి రాజీనామా
-
World News
Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
-
Crime News
కరాటే శిక్షణ ముసుగులో సంఘవిద్రోహ చర్యలు.. నిజామాబాద్‌లో ముగ్గురి అరెస్టు
-
India News
Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే సతీమణి గురించి తెలుసా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్