Sri Lanka: శ్రీలంకలో పాఠశాలల మూసివేత..మరోమారు భారత్‌ ఇంధన సాయం

శ్రీలంకలో ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. దీంతో జులై 4వ తేదీ నుంచి వారం రోజులపాటు అక్కడి పాఠశాలలు పూర్తిగా మూసివేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొంది. ఈ సారి శెలవుల

Published : 04 Jul 2022 11:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలో ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. దీంతో జులై 4వ తేదీ నుంచి వారం రోజులపాటు పాఠశాలలను పూర్తిగా మూసివేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొంది. ఈ సారి సెలవుల సీజన్‌లో మిగిలిన సిలబస్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇటీవల జూన్‌ 18వ తేదీ నుంచి ఒక వారం సెలవులు ప్రకటించారు. శ్రీలంక విద్యాశాఖ మంత్రి నిహాల్‌ రణసింఘే మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని పాఠశాల యాజమాన్యాలను కోరారు. ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలు అవసరం లేని విద్యార్థులతో డివిజనల్‌ స్థాయిలో తరగతులు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.

మరోసారి భారత్‌ ఆపన్న హస్తం

శ్రీలంకను ఇంధన సంక్షోభం నుంచి బయటపడేయటానికి భారత్‌ మరోసారి సాయం చేసింది. నాలుగు నౌకలతో డీజిల్‌, పెట్రోల్‌ను తరలించనుంది. వీటిల్లో ఒక నౌక జులై 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో శ్రీలంకకు చేరుకోనుంది. మరో నౌక జులై 29 నుంచి 31వ తేదీలోపు వెళ్లనుంది. ఆగస్టు  రెండో వారంలో కూడా భారత్‌ నుంచి ఇంధనం వెళ్లనుంది. ఇటీవల శ్రీలంక దౌత్యవేత్త మిలింద మోరగోడ భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరితో భేటీ అయి సాయం కోరారు. దీంతో భారత్‌ ఇంధన రవాణాకు సిద్ధమైంది. పెట్రోలియం సరఫరా కోసం దీర్ఘకాలిక భాగస్వామ్యానికి శ్రీలంక సంసిద్ధత వ్యక్తం చేసింది.

గత మూడు నెలల్లో భారత్‌ నుంచి దాదాపు 4,00,000 టన్నుల చమురు వివిధ దశల్లో శ్రీలంకకు చేరుకొంది. ఇక జులైలో 33 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ను సరఫరా చేయనున్నారు. రానున్న నాలుగు నెలల్లో ఇది లక్ష టన్నులకు చేరే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని