Sri Lanka: రెండేళ్ల ఆర్థిక కష్టాలు.. భారత్‌ వల్లే గట్టెక్కాం: శ్రీలంక

భారత్‌ తోడ్పాటుతోనే తమ దేశం రెండేళ్ల ఆర్థిక కష్టాల సమయంలో మనుగడ సాగించినట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె తెలిపారు.

Published : 22 Jun 2024 22:10 IST

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక (Sri Lanka) విలవిల్లాడిన విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో.. ఇంధనం, నిత్యవసరాల కొరతతో కొట్టుమిట్టాడింది. అయితే.. భారత్‌ తోడ్పాటుతోనే రెండేళ్ల ఆర్థిక కష్టాల సమయంలో తమ దేశం గట్టెక్కినట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె (Ranil Wickremesinghe) తెలిపారు. భారత్‌ సమకూర్చిన 3.5 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయంతోనే మనుగడ సాధ్యమైనట్లు పేర్కొన్నారు. కొలంబోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దిల్లీతో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

కనీసం నలుగురు పిల్లలుంటే.. జీవితాంతం ట్యాక్స్‌ కట్టక్కర్లేదు: ఎక్కడో తెలుసా?

‘‘భారత్‌- శ్రీలంకల మధ్య పవర్‌ గ్రిడ్‌ ఇంటర్‌కనెక్షన్‌, భూ అనుసంధాన మార్గం, ట్రింకోమలీ అభివృద్ధి ప్రాజెక్టు, భారత్‌లోని నాగపట్నం నుంచి ట్రింకోమలీ వరకు చమురు పైప్‌లైన్‌ నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్‌కు వెళ్లిన సందర్భంగా ఆయనతో ఇరుదేశాల భాగస్వామ్యానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించాను. ఉమ్మడి ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించాను’’ అని విక్రమసింఘె తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా 2022 ఏప్రిల్‌లో విదేశీ రుణాలను శ్రీలంక డీఫాల్ట్‌గా ప్రకటించింది. ప్రజల నిరసనలతో అప్పటి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని