Russia: రష్యాలో వింత వ్యాధి విజృంభణ

రష్యాలో పదుల సంఖ్యలో బాచులిజం అనుమానిత కేసులు విజృంభించాయి. అరుదైన, ప్రమాదకరమైన ఈ వ్యాధి లక్షణాలతో నాలుగు భిన్న ప్రాంతాల్లో బాధితులు ఆసుపత్రుల్లో చేరారు.

Published : 19 Jun 2024 05:25 IST

మాస్కో: రష్యాలో పదుల సంఖ్యలో బాచులిజం అనుమానిత కేసులు విజృంభించాయి. అరుదైన, ప్రమాదకరమైన ఈ వ్యాధి లక్షణాలతో నాలుగు భిన్న ప్రాంతాల్లో బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. దీంతో అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఒక ప్రముఖ డెలివరీ సంస్థ తయారుచేసిన సలాడ్లతో ఈ వ్యాధి తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ సంస్థకు చెందిన ఇద్దరు అధికారులు, కేన్డ్‌ బీన్స్‌ను ఉత్పత్తి చేసే మరో సంస్థ అధిపతిని అరెస్టు చేశారు. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి వీరు ఆహార ఉత్పత్తులను తయారుచేసి, పంపిణీ చేస్తున్నారన్న అభియోగాలను నమోదు చేశారు. 

క్లోస్ట్రిడియం బాచులినియం అనే ఒక రకం బ్యాక్టీరియా వెలువరించే విష పదార్థమే ఆహారం ద్వారా వచ్చే బాచులిజానికి కారణం. ఈ పదార్థంతో కలుషితమైన ఆహారాన్ని తిన్నవారికి పక్షవాతం, శ్వాసలో ఇబ్బంది వంటివి తలెత్తవచ్చు. పరిస్థితి విషమిస్తే మరణమూ సంభవించొచ్చు. ఈ రుగ్మత బాధితుల్లో తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, చూపు మసకబారడం, నోరు పొడిబారడం, ఆహారాన్ని మింగడం, మాట్లాడటంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని