Hinduja Family: హిందుజా కుటుంబానికి షాక్‌..! శ్రమదోపిడీ కేసులో నలుగురికి జైలుశిక్ష

తమ వద్ద పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో సంపన్న ‘హిందుజా’ కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది.

Published : 21 Jun 2024 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబానికి (Hinduja Family) షాక్‌ తగిలింది. స్విట్జర్లాండ్‌ జెనీవాలోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో ఆ కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశ్‌ హిందుజా, ఆయన సతీమణి కమల్‌కు నాలుగున్నరేళ్లు, కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు నాలుగేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. తీర్పు సమయంలో వారెవరూ కోర్టులో లేరు. అదేవిధంగా కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్‌ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్‌ శిక్ష విధించింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను మాత్రం కోర్టు తోసిపుచ్చింది.

ఆ ఉద్యోగి జీతం కంటే.. శునకం కోసమే ఎక్కువ ఖర్చట!

తమ విల్లాలో పనిచేసేవారిపై శ్రమదోపిడీకి పాల్పడుతోందని, వారి పాస్‌పోర్టులను తమ దగ్గరే పెట్టుకున్నట్లు హిందుజా కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. వారి అనుమతి లేకుండా బయటకు వెళ్లనిచ్చేవారు కాదట. ఆ సిబ్బంది కంటే పెంపుడు శునకానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నరన్న విమర్శలు ఉన్నాయి. ఓ మహిళా ఉద్యోగి రోజుకు 15- 18 గంటలపాటు పనిచేస్తే.. 6.19 పౌండ్లకంటే తక్కువ చెల్లిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. వారి ఇంట్లో శునకానికి మాత్రం ఏడాదికి 7615 పౌండ్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఆ కుటుంబంలో నలుగురిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును విచారించిన స్విస్‌ క్రిమినల్‌ కోర్టు.. ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే.. దీనిపై అప్పీల్‌కు వెళ్తామని ప్రతివాదుల తరఫు న్యాయవాది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు