Taiwan: అప్రమత్తంగా ఉండండి.. చైనా సైన్యం ఏ క్షణమైనా చొరబడొచ్చు..

తైవాన్‌ జలాలు, గగనతలంలోకి ఏ క్షణామైనా చైనా దళాలు ప్రవేశించే ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణశాఖ మంత్రి పార్లమెంట్‌లో స్వయంగా ప్రకటించారు.

Published : 06 Mar 2023 13:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చైనా(china) సైన్యం ఏ క్షణమైనా తమ భూభాగంలోకి చొరబడే ప్రమాదం ఉందని తైవాన్‌(Taiwan) రక్షణ మంత్రి చూ-కూ-చెంగ్‌ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య తైవాన్‌(Taiwan) జలసంధి సమీపంలో ఘర్షణ వాతావరణంతో ఈ పరిస్థితి నెలకొంది. తైవాన్‌(Taiwan) చుట్టుపక్కల ఇటీవల కాలంలో చైనా (china) సైన్యం కదలికలు బాగా పెరిగిపోయాయి. దీంతోపాటు దాదాపు రోజువారీగా చైనా(china) విమానాలు తైవాన్ సమీపంలోకి రావడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తైవాన్‌ పార్లమెంట్‌లో ఆ దేశ రక్షణ మంత్రి చెంగ్‌ మాట్లాడుతూ తైవాన్‌ సమీపంలోని జలాలు, గగనతలంలోకి రావడానికి పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కారణాలు వెతుక్కుంటోందన్నారు. ఇటీవల కాలంలో తైవాన్‌-అమెరికా మధ్య  సైనిక సహకారం పెరగడానికి ఇది కూడా కారణమని తెలియజేశారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ హఠాత్తుగా తైవాన్‌ భూభాగం సమీపానికి చేరవచ్చన్నారు. 

చైనా ఈ మేరకు సన్నాహాలు చేస్తుండటంతో ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు చెంగ్‌ పేర్కొన్నారు. వారు అవకాశం కోసం చూస్తుంటే కనుక నిజంగానే బలప్రయోగం చేస్తారన్నారు. చైనా తమ భూభాగంలోకి చొరబడితే కచ్చితంగా ఎదురుదాడి చేస్తామని ఇప్పటికే తైవాన్‌ ప్రకటించింది. మరోవైపు చైనా ప్రీమియర్‌ లీక్వికియాంగ్‌ ఆదివారం మాట్లాడుతూ తైవాన్‌తో సంబంధాలను తాము ప్రమోట్‌ చేస్తామని.. శాంతియుత విలీనాన్ని ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు. అదే సమయంలో తైవాన్‌ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ రక్షణ మంత్రి ప్రకటన వెలువడటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు