China-Taiwan: చైనాలో ఉపగ్రహ ప్రయోగం.. వణికిపోయిన తైవాన్‌ వాసులు

నేడు తమ ఫోన్లకు వచ్చిన హెచ్చరిక సందేశాలతో తైవాన్‌(Taiwan) ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చైనా(China) ఉపగ్రహ ప్రయోగం వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Published : 09 Jan 2024 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా(China) చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం(China satellite launch)తో తైవాన్‌లో ఎమర్జెన్సీ వ్యవస్థ(Taiwan emergency alert) యాక్టివేట్ అయింది. ప్రజలకు ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌లు అందాయి. తైవాన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

చైనా(China) మంగళవారం ఐన్‌స్టీన్‌ ప్రోబ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. షీచాంగ్‌ ఉపగ్రహ కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైందని డ్రాగన్‌ వెల్లడించింది. సరిగ్గా అప్పుడే తైవాన్‌ ప్రజల ఫోన్లకు అత్యవసర హెచ్చరిక  సందేశం వచ్చింది. ‘మన దక్షిణ గగనతలం మీదుగా చైనా ప్రయోగించిన ఉపగ్రహం వెళ్లనుంది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి’ అన్నది ఆ సందేశం సారాంశం. దాంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

మాల్దీవుల వివాదం వేళ.. బయటపడిన చైనా వక్రబుద్ధి

మరోపక్క అదే సమయంలో విదేశీ మీడియా ప్రతినిధులతో తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసెఫ్ వూ మాట్లాడుతున్నారు. ఇది ఉపగ్రహ ప్రయోగమని మంత్రి వారికి ధైర్యం చెప్పారు. ‘రాకెట్ మా గగనతలం మీదుగా వెళ్తున్నప్పుడు.. దాని ట్యూబులు, ఇతర శిథిలాలు మా ప్రాంతంలో పడే అవకాశం ఉంది. అందుకే మా జాతీయ హెచ్చరిక కేంద్రం ఈ సందేశాలు పంపింది. గతంలోనూ ఇలా జరిగింది’ అని మంత్రి వివరించారు.

జనవరి 13న తైవాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా(USA), చైనా(China) వీటిని నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధ విమానాలు, నౌకలు, డ్రోన్లు పంపుతూ.. ఇలా నిత్యం ఏదో ఒక రూపంలో తైవాన్‌ సమీపంలో చైనా నిఘా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని