Afghanistan: అఫ్గాన్ గజగజ.. వారంలో 78 మంది మృతి
అఫ్గానిస్థాన్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలిని తట్టుకోలేక జనం ఇబ్బందులు పడుతున్నారు. గత వారంలోనే తీవ్ర చలి కారణంగా 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్లు వెల్లడించారు.
ఇస్లామాబాద్: తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్ (Afghanistan) ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటువంటి సమయంలో అక్కడి ప్రతికూల వాతావరణం మరింత వారికి శాపంగా మారుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో అఫ్గాన్ గజగజ వణుకుతోంది. దీంతో గత వారం రోజుల్లోనే 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ జాతీయ విపత్తు ప్రతిస్పందనశాఖ వెల్లడించింది.
అఫ్గాన్‌లో ప్రస్తుతం -35డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రతను తట్టుకోలేక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో వారం వ్యవధిలోనే 78 మంది పౌరులతోపాటు 75వేల పశువులు కూడా మృతి చెందినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి షఫీవుల్లా రహీమి వెల్లడించారు. అతిశీతల వాతావరణం కారణంగా చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.. దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 లక్షల మందికి సాధ్యమైనంత మేర సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ (Taliban) చేతుల్లోకి అఫ్గాన్ వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారిని ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించకపోవడంతో ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అక్కడ ఆర్థిక, ఆహార సంక్షోభం ఎక్కువైంది. ఇదే సమయంలో కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మాత్రం మానవతా సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ, మహిళా వర్కర్లపై తాలిబన్లు పెడుతోన్న ఆంక్షలకు నిరసనగా ఆ స్వచ్ఛంద సంస్థలు చేస్తోన్న మానవతా సహాయాన్ని నిలిపివేశాయి. ఇదే సమయంలో ప్రతికూల వాతావరణంతో అక్కడ పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Bill Gates: వంటవాడిగా బిల్‌గేట్స్.. రోటీ తయారీ!
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్