Ukraine: చనిపోతున్న బిడ్డల గురించి రష్యన్ తల్లులకు చెప్పండి..!

పదిరోజులుగా రష్యా చేస్తోన్న దాడులతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఇరు వైపులా ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి.

Published : 06 Mar 2022 01:26 IST

కీవ్‌: పదిరోజులుగా రష్యా చేస్తోన్న దాడులతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఇరు వైపులా ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. అమాయక ప్రజలు నలిగిపోతున్నారు. ఈ సమయంలో ప్రపంచానికి నిజం చెప్పండంటూ ఉక్రెయిన్ ప్రథమ మహిళ వొలెనా జెలెన్‌స్కా.. ఇతర దేశాల ప్రథమ మహిళలను కోరారు. రష్యా చేపడుతోందని సైనిక చర్య కాదని, పూర్తి స్థాయి యుద్ధమని.. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించండని అభ్యర్థించారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

* రష్యా చెప్పినట్లుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్నది ప్రత్యేక సైనిక చర్య కాదు. అది పూర్తి స్థాయి యుద్ధం. దీని గురించి మాట్లాడండి. 

ఉక్రెయిన్ చిన్నారులు, విద్యకు దూరమవుతోన్న వారి పరిస్థితి గురించి చెప్పండి. 

* మీ బిడ్డలు యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో మరణిస్తున్నారని రష్యన్ తల్లులకు వినిపించేలా చెప్పండి. 

ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. తనను తాను రక్షించుకుంటుంది. ఎప్పటికీ లొంగిపోదు. ఉక్రెయిన్‌ను రక్షించాల్సిన పనిలేదు. కానీ, మా ప్రజలు, సైనికులకు ఈ ప్రపంచం నుంచి సహాయం కావాలి. అది మాటల రూపంలో కాదు.

* ఈ యుద్ధం ఎక్కడో జరుగుతుందని భావించకండి. ఇది ఐరోపాలో జరుగుతోంది. ఐరోపా సరిహద్దుల్లో జరుగుతోంది. భవిష్యత్తులో మీపై దాడిచేసే శత్రువును ఉక్రెయిన్ ఎదుర్కొంటోందని చెప్పండి. పుతిన్ అణు దాడి గురించి బెదిరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం అనేదే ఉండదని చాటండి’ అంటూ  తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు