Texas shooting: టెక్సాస్‌ ఘటనలో వేచి చూడటం.. పోలీసులది తప్పుడు నిర్ణయమే!

ఇటీవల అమెరికా టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాకీతో కాల్పులు జరిపి 19 మంది చిన్నారులతోపాటు మొత్తం 21 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటనలో పోలీసులు..

Published : 29 May 2022 01:49 IST

టెక్సాస్‌: ఇటీవల అమెరికా టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాకీతో కాల్పులు జరిపి 19 మంది చిన్నారులతోపాటు మొత్తం 21 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటనలో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. అయితే, అంతకుముందు దాదాపు గంటసేపు నిందితుడు దారుణానికి పాల్పడుతోన్నా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా పోలీసులూ ఈ విషయాన్ని అంగీకరించారు! తక్షణమే లోపలికి వెళ్లకుండా.. బయట వేచి ఉండాలని భావించి అక్కడి ఆన్‌సైట్‌ కమాండర్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ కర్నల్ స్టీవెన్ మెక్‌క్రా తెలిపారు

స్కూల్‌లో పక్కపక్కనే ఉన్న తరగతి గదుల్లోకి ప్రవేశించిన నిందితుడిని అక్కడే కట్టడి చేశారని, పిల్లలకు ఇక ప్రమాదం లేదని ఘటనాస్థలంలో ఉన్న కమాండర్, స్కూల్ డిస్టిక్ట్ పోలీస్ చీఫ్ తప్పుడు అంచనా వేశారని మెక్‌క్రా తెలిపారు. పెద్ద దాడి కాదని భావించి.. అతన్ని ఎదుర్కొనేందుకు వేచి ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. మరోవైపు.. నిందితుడు కాల్పులు జరుపుతోన్న సమయంలో.. లోపల ప్రాణాలతో బయటపడినవారు అత్యవసర నంబర్‌కు పదే పదే కాల్ చేశారు. 12:47 సమయంలోనూ ఓ విద్యార్థి ఫోన్‌ చేసి తక్షణమే పోలీసులను పంపమని అడిగినట్లు అధికారులు తెలిపారు. అయితే.. గది వెలుపల హాల్‌లో ఉన్న పోలీసులు మాత్రం ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది కోసం దాదాపు 48 నిమిషాలు వేచి ఉన్నారు. ఎట్టకేలకు ప్రత్యేక బృందం చేరుకున్నాక.. 12.50 తర్వాత నిందితుడిని మట్టుబెట్టినట్లు మెక్‌క్రా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని