Thailand: థాయ్‌లాండ్‌లో 13 లక్షల మందికి అస్వస్థత!
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్(Bangkok)లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. దీంతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని థాయ్ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ (Thailand) గాలి నాణ్యత (Air Quality) రోజు రోజుకు దిగజారుతోంది. గత వారం రోజుల్లో వాయుకాలుష్యం (Air Pollution) కారణంగా దేశంలో సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రెండు లక్షల మంది ఆస్పత్రుల్లో చేరినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. వాహన కాలుష్యం, పరిశ్రమలు విడుదలచేసే కర్బనఉద్గారాలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వెలువడే పొగ కారణంగా థాయ్ రాజధాని బ్యాంకాక్(Bangkok)లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. దీంతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని థాయ్ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.
‘‘గత మూడు రోజులుగా బ్యాంకాక్‌లో 50 జిల్లాల్లో పీఎం 2.5 స్థాయిలు నమోదయ్యాయి. గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు మనిషి రక్తంలో కలిసిపోయి శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశంలో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలను దాటిపోయింది. అందుకే ప్రజలను ఇంటి నుంచే పనిచేయాలని, బయటకు వచ్చేప్పుడు ఎన్95 మాస్కులు ధరించాలని సూచించాం. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా వారిని ఎక్కువ సమయం బయటకు పంపొద్దని తల్లిదండ్రులను కోరాం. పాఠశాలలతోపాటు, పార్క్‌లు వంటి చోట్ల నో డస్ట్ రూమ్ (No Dust Room) పేరుతో ఎయిర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేశాం’’ అని థాయ్ ఆరోగ్య శాఖ తెలిపింది.
బ్యాంకాక్ తర్వాత చియాంగ్ మై (Chiang Mai) నగరంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడ ఎక్కువ శాతం మందికి వ్యవసాయం ప్రధాన వృత్తి. దీంతో ఈ ప్రాంతంలో పంట వ్యర్థాలను ఎక్కువగా తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను పెంచేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి