Thailand: థాయ్‌లాండ్‌ వెళ్లాలంటే ‘టూరిస్ట్‌ ఫీజు’ కట్టాల్సిందే!

తమ దేశానికి వచ్చే పర్యాటకులపై టూరిస్ట్‌ ఫీజు వసూలు చేయాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ నెల నుంచి ప్రతి పర్యటకుడిపై 300 బాట్స్‌(రూ.664) వసూలు చేయనుంది. థాయ్‌లాండ్‌ వాణిజ్యం ఎక్కువగా పర్యటక రంగంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, కరోనా నేపథ్యంలో ఆ దేశంలో

Published : 13 Jan 2022 01:50 IST

బ్యాంకాక్‌: తమ దేశానికి వచ్చే పర్యాటకులపై టూరిస్ట్‌ ఫీజు వసూలు చేయాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ నెల నుంచి ప్రతి పర్యటకుడిపై 300 బాట్స్‌(రూ.664) వసూలు చేయనుంది. థాయ్‌లాండ్‌ వాణిజ్యం ఎక్కువగా పర్యటక రంగంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, కరోనా నేపథ్యంలో ఆ దేశంలో పర్యటక రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు తిరిగి ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం పర్యటకుల నుంచే నిధులు రాబట్టేందుకు ఈ టూరిస్టు ఫీజును వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫీజు ప్రభుత్వ టూరిస్ట్‌ ప్యాకేజీలతోపాటు చెల్లించాల్సి ఉంటుందని థాయ్‌లాండ్‌ ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. ఇందులోనే పర్యటకులకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పర్యటకులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది 15 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు రావొచ్చని, వీరి ద్వారా 23.97 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని