Global Warming: ఉద్గారాలు తగ్గినప్పటికీ.. వచ్చే దశాబ్దంలోనే 1.5 డిగ్రీలకు భూతాపం!
వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల తగ్గినప్పటికీ వచ్చే దశాబ్దంలోనే భూతాపం 1.5 డిగ్రీలు దాటుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ ఆధారంగా ఈ అంచనా వేసింది.
వాషింగ్టన్: ఉద్గారాలు(Emissions) తగ్గినప్పటికీ.. రానున్న 10- 15 ఏళ్లలో భూతాపం(Global Warming) పెరుగుదల 1.5 డిగ్రీలు దాటుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఒకవేళ ఉద్గారాల విడుదల అధికంగా ఉంటే.. ఈ శతాబ్దం మధ్య నాటి(2050)కే భూతాపం పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోల్చితే సగటున రెండు డిగ్రీలు పెరిగే అవకాశం రెండింట ఒకవంతుగా ఉందని అధ్యయనం అంచనా వేసింది. 2060 నాటికి ఐదింట నాలుగువంతుల కంటే ఎక్కువ అవకాశం ఉందని తెలిపింది. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన ఇటీవలి ఉష్ణోగ్రతల వివరాలను ఉపయోగించి కృత్రిమ మేధ(AI) సాయంతో భవిష్యత్తు వాతావరణ మార్పులను ఇందులో అంచనా వేశారు.
భవిష్యత్తు వాతావరణ మార్పుల అంచనా విషయంలో పూర్తిగా కొత్త విధానాన్ని ఉపయోగించి ఈ అధ్యయనాన్ని రూపొందించినట్లు ప్రధాన రచయిత, అమెరికా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త నోహ్ డిఫెన్‌బాగ్ చెప్పారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త, అధ్యయన సహ రచయిత ఎలిజబెత్ బర్న్స్‌తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. ‘ఒకవేళ నెట్-జీరో ఉద్గారాల స్థాయికి చేరుకునేందుకు మరో అర శతాబ్దం పట్టినట్లయితే.. అప్పటికి భూతాపం 2 డిగ్రీల సెల్సియస్ మించిపోయే అవకాశం ఉంది’ అని తమ ఏఐ మోడల్ అధ్యయనంలో తేలిందన్నారు. తాజా అధ్యయనంలో పరిశోధకులు ‘న్యూరల్ నెట్‌వర్క్’ అనే కృత్రిమ మేధ ఉపయోగించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP CID : తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు
-
Movies News
Bhanushree: సినీ పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య ఇదే.. ‘వరుడు’ హీరోయిన్ కామెంట్స్
-
India News
Rahul Gandhi: నేడు మీడియా ముందుకు రాహుల్ గాంధీ.. ఏం చెప్పనున్నారు..?
-
World News
Ro Khanna: ‘ఇందుకోసమా మా తాత జైలుకెళ్లింది..?’: రాహుల్ అనర్హతపై యూఎస్ చట్టసభ్యుడు
-
Sports News
Team India: 2019 వరల్డ్ కప్ సమయంలో ఇదే సమస్య ఎదురైంది: జహీర్‌ఖాన్
-
Movies News
Chiranjeevi: ‘రంగమార్తాండ’ చూసి భావోద్వేగానికి గురయ్యా: చిరంజీవి