Published : 30 Apr 2022 02:26 IST

Airbnb: ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పనిచేసుకోండి.. ఓ సంస్థ బంపర్‌ ఆఫర్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని ఓ సంస్థ తమ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. సంస్థ ప్రయోజనాల నిమిత్తం ప్రపంచంలోని ఏమూల నుంచైనా పని చేసుకునే స్వేచ్ఛను కల్పించింది. కొంతమంది సిబ్బంది మాత్రమే కార్యాలయానికి వస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ‘ఎయిర్‌బీఎన్‌బీ’ (Airbnb) అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్‌, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్‌, ఇతర సేవలందిస్తోంది. ఈ సంస్థ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫీస్‌, ఇళ్లు, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, లేదా 170 దేశాల్లోని ఏ మూల నుంచైనా తమ ఉద్యోగులు పనిచేసుకోవచ్చని ప్రకటించింది.

పని ప్రాంతం జీతంపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా సంస్థ వెల్లడించింది. మరికొద్ది నెలల్లోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సంస్థ సీఈఓ బ్రియాన్‌ చెస్కీ తమ ఉద్యోగులందరికి గురువారం ఈ-మెయిల్‌ చేశారు. విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి మాత్రమే కొన్ని సంస్థ షరతులు విధించింది. ఆఫీస్‌/ఇళ్లు/ఎక్కడి నుంచైనా పనిపై ఉద్యోగులకు సీఈఓ నాలుగు ముఖ్య విషయాలను వివరించారు.

* ఉద్యోగులు ఎక్కడినుంచైతే ఉత్తమ పనితనం చూపించగలరో, అధిక ఉత్పాదకత రాబట్టగలరో అక్కడి నుంచే పని చేసేందుకు (కార్యాలయం, ఇళ్లు) సంస్థ వెసులుబాటును కల్పించింది. చాలా మంది ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఆఫీస్‌ కార్యకలాపాలు చూసుకునేందుకు కొద్దిమంది మాత్రం కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.

* ఉద్యోగులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి మారిపోవచ్చు. కుటుంబానికి దగ్గరగానైనా, లేదా మీరు కలలుగనే మరో ప్రాంతానికైనా. ఇది మీ జీతంపై ఎలాంటి ప్రభావం చూపదు. జూన్ నుంచి జీతం, ఈక్విటీ రెండింటికీ ఒకే తరహాలో చెల్లింపులు జరుగుతాయి. ఒకేవేళ ప్రాంతాన్ని బట్టి తక్కువ చెల్లింపులు జరిగితే జూన్‌లో ఆయా ఉద్యోగులు పెరుగుదలను అందుకుంటారు.

* సెప్టెంబర్‌ నుంచి ఎయిర్‌బీఎన్‌బీ ఉద్యోగులు 170 దేశాల్లోని ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకోవచ్చు. ట్యాక్సులు ఇతర కారణాల వల్ల 90 రోజులు ఒకే ప్రాంతంలో ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్‌లను పొందాల్సి ఉంటుంది. ఉద్యోగుల సౌలభ్యం కోసం స్థానిక ప్రభుత్వాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతోంది.

* ఎయిర్‌బీఎన్‌బీ ఏడాది పొడవునా అర్థవంతమైన వ్యక్తిగత సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మహమ్మారి ఇంకా కొనసాగుతున్న కారణంగా ఈ సంవత్సరం పరిమిత ఆఫ్-సైట్ ఈవెంట్‌లు ఉంటాయి అని సీఈఓ బ్రియాన్‌ చెస్కీ ఈమెయిల్‌ ద్వారా వెల్లడించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని