Pineapple: అబ్బో..ఈ పైనాపిల్ చాలా ‘రిచ్’ గురూ.. ఒక్కో పండు రూ.లక్ష!
సాధారణంగా పైనాపిల్ ధర రూ.50 లేదా 100 లోపే ఉంటుంది. కానీ, బ్రిటన్‌లోని హెలిగాన్ పైనాపిల్ మాత్రం రూ. 1 లక్ష పలుకుతోంది. ఎందుకో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: పైనాపిల్ (Pineapple).. విటమిన్-సి ఎక్కువగా లభించే పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల (anti-oxidants)తోపాటు మాంగనీస్, పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ధరకే దొరకడంతో పాటు.. పోషకాలు ఎక్కువగా ఉండటంతో వైద్యులు కూడా దీనిని సూచిస్తుంటారు. కానీ, ఇంగ్లాండ్‌లో లభ్యమయ్యే హెలిగాన్ పైనాపిల్ ధర వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఒక్కో పండు అక్షరాల రూ.లక్ష. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన పైనాపిల్ అట. ధర ఎక్కువగా ఉన్నా దీనిని కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారట. ఈ పంట చేతికొచ్చేందుకు దాదాపు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని హెలిగాన్ గార్డెన్ నిర్వాహకులు వెల్లడించారు. అందుకే ఇంత ధరేమో..!
తొలిసారిగా దీనిని 1819లో బ్రిటన్(Britain)కు తీసుకొచ్చారు. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెక్కతో చేసిన పెద్దపెద్ద కుండీలు ఏర్పాటు చేసి, అందులో సేంద్రీయ ఎరువులు నింపి, తగినంత ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘‘ఈ పైనాపిల్ సాగుకు చాలా మంది కూలీలు కావాలి. చిన్న పిల్లలను పెంచినంతలా వీటిపై శ్రద్ధ చూపాలి. దీనికి తోడు రవాణా ఖర్చులు, స్టోరేజీ ఇలా అన్నీ లెక్కవేస్తే కనీసం రూ.లక్ష రూపాయలు (1000 పౌండ్స్) అమ్మనిదే గిట్టుబాటు కావడం లేదు’’ అని హెలిగాన్ నిర్వాహకులు తెలిపారు. ఈ హెలిగాన్ పైనాపిల్‌ను దివంగత ఎలిజెబెత్-2కి బహుమతిగా కూడా ఇచ్చారట. ప్రస్తుతం రూ. 1లక్షకు విక్రయిస్తున్నామని.. ఒకవేళ వేలం పెడితే రూ. 10 లక్షల వరకు ధర పలకొచ్చని గార్డెన్ నిర్వాహకులు అంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
-
Movies News
Dhanush: ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: ధనుష్
-
Sports News
IND vs AUS: గిల్, సూర్యకుమార్.. ఇద్దరిలో ఎవరు? రోహిత్ ఏమన్నాడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు