Modi-Putin: అందుకే.. మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పని పుతిన్‌..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నేడు. ఈ విషయం తెలిసినప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ శుక్రవారం జరిగిన ఎస్‌సీవో

Published : 18 Sep 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నేడు. ఈ విషయం తెలిసినప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ శుక్రవారం జరిగిన ఎస్‌సీవో భేటీలో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదట. అయితే దీనికి ఓ కారణం ఉందని క్రెమ్లిన్‌ అధినేత తెలిపారు.

ఉజ్బెకిస్థాన్‌ వేదికగా శుక్రవారం జరిగిన షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సదస్సులో మోదీ.. పుతిన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. ‘‘రేపు(సెప్టెంబరు 17) నా ప్రియమైన మిత్రుడు మోదీ పుట్టినరోజు అని నాకు తెలుసు. అయితే రష్యా సంప్రదాయం ప్రకారం.. మేం ఎప్పుడూ ఎవరికీ ముందస్తు శుభాకాంక్షలు చెప్పం. అందువల్ల, ఇప్పుడు మీకు కూడా పుట్టినరోజు విషెస్‌ చెప్పలేకపోతున్నా. అయితే మీ భవిష్యత్తు ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. మా ప్రియ దేశమైన భారత్‌కు ఆల్‌ ది బెస్ట్‌. మీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.

ఎస్‌సీవో సదస్సుకు హాజరైన మోదీ.. పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత ఈ దేశాధినేతలిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాల్సిందిగా మోదీ.. పుతిన్‌ను కోరారు. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని ఆయనకు సూచించారు. మోదీ పిలుపునకు సానుకూలంగా స్పందించిన పుతిన్‌.. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని