Mysterious Creature: జూలో వింత జంతువు.. చివరకు తేలిందేంటంటే!

యూకేలోని ఓ జూ అధికారులకు ఇటీవల విచిత్ర పరిస్థితి ఎదురైంది. కొన్నాళ్లుగా జూలో ఓ వింత జంతువు కంటపడుతుండటంతో హైరానా పడిన వారు.. అదేంటా అని కనుక్కునే ప్రయత్నం చేశారు. చివరకు అదొక బొమ్మ మొసలి అని తేలడంతో.. ఊపిరి పీల్చుకున్నారు...

Published : 11 Jan 2022 23:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకేలోని ఓ జూ అధికారులకు ఇటీవల విచిత్ర పరిస్థితి ఎదురైంది. కొన్నాళ్లుగా జూలో ఓ వింత జంతువు కంటపడుతుండటంతో హైరానా పడిన వారు.. అదేంటా అని కనుక్కునే ప్రయత్నం చేశారు. చివరకు అదొక బొమ్మ మొసలి అని తేలడంతో.. ఊపిరి పీల్చుకున్నారు. వేల్స్‌లోని కిల్‌గెట్టిలో ఉన్న ఫాలీ ఫార్మ్ అడ్వెంచర్ పార్క్, జూలో ఇది జరిగింది. ఇటీవల ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో ఒకరు.. ముంగిసల ఎన్‌క్లోజర్‌లోని నీళ్లలో ఓ జీవిని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విచిత్రమైన ఆకారంలో ఉన్న ఆ ప్రాణి తర్వాత కూడా కనిపించడంతో.. అధికారులు వెంటనే జూ కీపర్‌లను అప్రమత్తం చేశారు.

అది లోచ్‌ నెస్‌ మాన్‌స్టరా? లేదా రహస్య నీటి బల్లినా? ఏందో కనుక్కోవాలంటూ పరిశోధకుల బృందాన్ని రంగంలోకి దించారు. ఈ మేరకు వేట ప్రారంభించిన వారు.. చివరకు అదొక మొసలి బొమ్మగా గుర్తించారు. ఎవరో దాన్ని నీళ్లలో పారేసినట్లు భావిస్తున్నారు. ‘ఈ జీవి.. మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది’ అంటూ జూ సిబ్బంది ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘అదొక బొమ్మ మొసలి అని తేలడంతో మేం ఊపిరి పీల్చుకున్నాం. కానీ, ఈ సంఘటన మా అందరికి నవ్వు తెప్పించింది’ అని రాసుకొచ్చారు. కొంత మంది నెటిజన్లు ఇలాంటిదెప్పుడు చూడలేదని చెప్పగా.. మరికొంతమంది ఈ ‘జూ’ని సందర్శించాలనుకుంటున్నట్లు కామెంట్లు పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని