Paris shooting: పారిస్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

తుపాకీ కాల్పుల ఘటనతో పారిస్‌ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. నలుగురికి పైగా గాయపడినట్టు సమాచారం.

Published : 23 Dec 2022 20:02 IST

ప్యారిస్‌: ఫ్రాన్స్‌లోని పారిస్‌ (paris) నగరంలో కాల్పుల(Paris shooting) ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. సెంట్రల్‌ పారిస్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి పైగా గాయాలైనట్టు సమాచారం. 10వ అరోండెస్‌మెంట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. ప్రజలంతా ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తనకు ఏడెనిమిది తూటా పేలుడు శబ్దాలు వినిపించినట్టు అక్కడే ఓ దుకాణంలో ఉన్న మహిళ చెప్పినట్టు స్థానిక మీడియా పేర్కొంది.  దీంతో దుకాణానికి తాళం వేసి లోపల దాక్కున్నట్టు ఆమె వివరించారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న 69 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

మరోవైపు, ఈ ఘటనపై పారిస్‌ నగర డిప్యూటీ మేయర్‌ ఎమ్మాన్యుయేల్‌ గ్రెగోరీ ట్వీట్‌ చేశారు. తుపాకీ కాల్పులు జరిగిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఈ ఘటనతో సత్వరమే స్పందించిన భద్రతా బలగాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు ఈ సమయంలో అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. స్థానిక టౌన్‌ హాల్‌లో మెడికో-సైకలాజికల్‌ ఎమర్జెన్సీ సెల్‌ ఏర్పాటు చేసినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని