Viral news: ఇదేం ఏటీఎంరా బాబోయ్.. గుట్టంతా విప్పేస్తోంది!
అమెరికాలో మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం కస్టమర్ల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిల్చుంటే చాలు.. కస్టమర్ ఫొటో తీసి.. అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఏటీఎం పైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా డిస్ప్లే అవుతోంది
ఇంటర్నెట్‌డెస్క్: సాధారణంగా ఏటీఎంకి వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. వేరేవారు తమ అకౌంట్ వివరాలు తెలుసుకొని డబ్బులు దోచుకుంటారేమోనన్న అనుమానంతో ట్రాన్సాక్షన్ ముగిసిన తర్వాత కొంత మంది నంబర్ బోర్డుపై ఏవేవో అంకెలు నొక్కేసి బయటకి వస్తారు. అంటే, బ్యాంకు బ్యాలెన్స్గానీ, ఇతర వివరాలు గానీ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడతారు. కానీ, అమెరికాలో మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం కస్టమర్ల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిల్చుంటే చాలు.. కస్టమర్ ఫొటో తీసి.. అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఏటీఎం పైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా డిస్ప్లే అవుతుంది. బ్యాలెన్స్ పక్కనే కస్టమర్ ఫొటో కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ పేరు మొదటి స్థానంలో ఉండి.. ఆ తర్వాత అవరోహణ క్రమంలో సున్నా బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ల పేర్లనూ చూపిస్తోంది.
ఈ ఏటీఎంను న్యూయార్క్‌కు చెందిన ఎమ్ఎస్సీహెచ్ఎఫ్ సంస్థతో కలిసి పెర్రోటిన్గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ప్రయోగాత్మకంగా దీనిని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. సాధారణ ఏటీఎంలో లాగానే ఇందులోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చట. వైవిధ్యంగా ఉండటంతో చాలా మంది కస్టమర్లు దీనిని ఉపయోగించేందుకు ఎగబడుతున్నారు. కొందరు ఏటీఎంలో కార్డు పెట్టి.. ముఖం కనిపించకుండా కవర్ చేస్తే.‘BYE, Bloody Boys’ అంటూ సందేశం డిస్ప్లే అవుతోంది. దీనిని చూసుకొని వారంతా నవ్వుకుంటూ పక్కకి వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జోయల్ ఫ్రాంకో అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎక్కువ మంది మాత్రం వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని, ఎవరి అకౌంట్లో ఎంత ఉంటే ఇతరులకు ఎందుకు? అని వాదిస్తున్నారు. ఇలాంటి పద్ధతి చాలా ప్రమాదకరమని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు. ఏదేమైనా.. సాంకేతికతను సరైన మార్గంలో వాడుకోకపోతే ప్రమాదమే కదా..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!