Russia: రష్యాలో మరో మిస్టరీ మరణం.. కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్త దారుణ హత్య..!
రష్యా (Russia)లో మరో ప్రముఖ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వామిగా ప్రముఖ శాస్త్రవేత్తను ఓ ఆగంతకుడు హత్య చేసినట్లు మాస్కో మీడియా కథనాలు వెల్లడించాయి.
మాస్కో: రష్యా (Russia)లో ప్రముఖుల మరణాల వెనుక రహస్యమేంటో అంతుచిక్కట్లేదు. తాజాగా మరో ప్రముఖ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ (Covid vaccine) అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్‌ను ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేశాడు. బెల్ట్‌ను గొంతుకు బిగించి చంపేశాడు. ఈ మేరకు రష్యా మీడియా కథనాలు శనివారం వెల్లడించాయి.
47 ఏళ్ల బొటికోవ్ (Andrey Botiko).. మాస్కోలోని గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అంట్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. గురువారం ఆయన తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కన్పించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. బొటికోవ్‌తో నిందితుడు ఏదో విషయంలో గొడవ పెట్టుకున్నాడని, ఆ తర్వాత బెల్ట్‌తో అతడి గొంతు నులిమి అక్కడి నుంచి పారిపోయాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని అధికారులు చెప్పినట్లు రష్యా (Russia) న్యూస్ ఏజెన్సీ టాస్ కథనం వెల్లడించింది. అయితే, హత్యకు గల కారణాలేంటనే దానిపై పూర్తి స్పష్టత లేదు.
2020లో రష్యా (Russia)లో ‘స్పుత్నిక్ వి (Sputnik V)’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో బొటికోవ్ ఒకరు. కొవిడ్ టీకా తయారీలో ఆయన చేసిన సేవలకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin).. 2021లో ఆయనను ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్‌లాండ్’ పురస్కారంతో సత్కరించారు. అలాంటి వ్యక్తి ఓ ఆగంతకుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.
రష్యా (Russia)లో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు. గత కొంతకాలంగా ఆ దేశ సంపన్నులు, రాజకీయ నాయకులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల రష్యా రక్షణశాఖ ఆర్థిక సహాయ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఓ ఉన్నతాధికారి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 16 అంతస్తుల మీదినుంచి పడిపోవడంతో మృతి చెందారు. అంతకుముందు తీవ్రవాద కట్టడి విభాగంలో పనిచేసే రష్యన్ మేజర్ జనరల్ వ్లాదిమిర్ మకరోవ్ అనుమానాస్పద స్థితిలో తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఇక, గతేడాది డిసెంబరులోనూ భారత్‌లో రష్యా (Russia)కు చెందిన ఓ చట్టసభ సభ్యుడితోపాటు మరో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం