Eric Lander: జోబైడెన్‌ కార్యవర్గంలో తొలి రాజీనామా

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ ఎరిక్‌ లాండర్‌ రాజీనామా చేశారు. అతను తోటి సిబ్బందితో అనుచితంగా

Updated : 08 Feb 2022 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ ఎరిక్‌ లాండర్‌ రాజీనామా చేశారు. అతను తోటి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లు శ్వేత సౌధం నిర్ధారించిన కొన్ని గంటల్లోనే ఆయన పదవిని వీడారు. జో బైడెన్‌ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన కార్యనిర్వాహక వర్గంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. 

గతేడాది ఎరిక్‌ అనుచిత ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదును శ్వేతసౌధం విచారించింది. ఆయనపై ఆరోపణలు నిరూపించే ఆధారాలను శ్వేత సౌధం గుర్తించింది. ఎరిక్‌ తన కింది సిబ్బందిని వేధించడం, హీనంగా చూడటం వంటివి చేసినట్లు తేలింది. దీంతో ఎరిక్‌తో క్షమాపణలు చెప్పించిన శ్వేత సౌధం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, సాయంత్రం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ మాట్లాడుతూ ‘ఎరిక్‌ రాజీనామాను అధ్యక్షుడు బైడెన్‌ ఆమోదించారు. ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీకి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు’’ అని వెల్లడించారు. 

‘‘ నేను గతంలో, ప్రస్తుతం నాతో కలిసి పనిచేసిన సహచరులను మాటలతో బాధపెట్టాను. నేను ఈ పదవిలో సమర్థంగా సేవలు అందించేలా కొనసాగడం సాధ్యం కాదని నమ్ముతున్నాను’’ అని ఎరిక్‌ తన రాజీనామా లేఖలో వెల్లడించారు. ఎరిక్‌ను రాజీనామా చేయమని బైడెన్‌ కోరలేదని శ్వేత సౌధం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు