Ladakh: లద్దాఖ్‌లో వంతెనపై అమెరికా జనరల్‌ ఆందోళన..

లద్దాఖ్‌లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణంపై అమెరికా జనరల్‌ చార్లెల్‌ ఏ ఫ్లాయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రవర్తనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అస్థిరపరిచే,

Published : 08 Jun 2022 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లద్దాఖ్‌లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణంపై అమెరికా జనరల్‌ చార్లెల్‌ ఏ ఫ్లాయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రవర్తనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అస్థిరపరిచే, ఆక్రమించే వైఖరిని డ్రాగన్‌ అవలంభిస్తోందన్నారు. హిమాలయ సరిహద్దుల్లో చైనా నిర్మాణాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను. వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌లో చైనా చేపట్టిన నిర్మాణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. చైనాలోని ఆయుధాల వలే ఇది కూడా ఆందోళనకరంగా ఉంది.  ఇలాంటి సమయంలో కేవలం చైనా అస్థిర పర్చే ప్రవర్తన, ఆక్రమించే వైఖరిని అంచనావేయడం ఒక్కటే సరిపోదు. దాని ఆక్రమణ వైఖరిని సమష్టిగా అడ్డుకోవడం చాలా అవసరం’’ అని పేర్కొన్నారు.  జనరల్‌ చార్లెల్‌ ఏ ఫ్లాయన్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కొంత మంది జర్నలిస్టుల వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌-అమెరికా దళాలు సంయుక్తంగా గత అక్టోబర్‌లో ‘యుద్ధ అబ్యాస్‌’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి.  ఈ విన్యాసాలు ఓ రహస్య ప్రదేశంలో దాదాపు 10వేల అడుగుల ఎత్తున జరిగాయి. ఆ తర్వాత ఇటువంటి వాతావరణమే ఉన్న అలాస్కాలో కూడా యుద్ధవిన్యాసాలు సంయుక్తంగా నిర్వహించారు. ఇరు దేశాలు సంయుక్తంగా ఆపరేషన్లు చేపట్టే విధంగా హైఆల్టిట్యూడ్‌ వార్ఫేర్‌లో శిక్షణ పొందారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను మొత్తం భారత్‌-అమెరికాలు సంయుక్తంగా ఉపయోగించుకోగల అవకాశాలుగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని