Japan: 26మందితో పర్యాటక బోటు గల్లంతు!

జపాన్‌లో పర్యాటక బోటు గల్లంతైంది. షెరిటికో ద్వీపకల్పం వద్ద 26 మంది పర్యాటకులతో నీటిలోకి వెళ్లిన .....

Published : 24 Apr 2022 01:33 IST

టోక్యో: జపాన్‌లో పర్యాటక బోటు గల్లంతైంది. షెరిటికో ద్వీపకల్పం వద్ద 26 మంది పర్యాటకులతో వెళ్లిన కాజు-1 పడవ సంబంధాలను కోల్పోయినట్టు జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటించింది. బోటు ఆచూకీ కోసం నాలుగు హెలికాప్టర్లతో పాటు ఆరు పెట్రోలింగ్‌ బోట్‌లతో గాలిస్తున్నారు. బోటులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. జపాన్‌ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.15గంటల ప్రాంతంలో ఈ బోటు సంబంధాలు కోల్పోయింది. అయితే, దాదాపు ఎనిమిది గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్కరి ఆచూకీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హక్కైడో ఉత్తర ద్వీపంలో షెరిటొకో ద్వీపకల్పం వద్ద ఈ మధ్యాహ్నం పెద్ద ఎత్తున గాలులు వీయడంతో ఈ పడవ మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం నెలకొనడంతో ఈ మధ్యాహ్నం మత్స్యకార పడవలు కూడా తిరిగి వచ్చేశాయని జపాన్‌ మీడియా పేర్కొంది. గల్లంతైన బోటులో 24మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని