Justine trudeau: ముఖ్య విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో

భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 17 Jun 2024 06:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ, కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను మేం డీల్‌ చేస్తాం’ అని ట్రూడో జీ7 చివరి రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాని మోదీ తాను ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో శుక్రవారం పోస్టు చేశారు. దీనిపై కెనడా ప్రధాని కార్యాలయం స్పందిస్తూ, ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని పేర్కొంది. జీ20 సదస్సు తర్వాత భారత్‌పై కెనడా ప్రధాని నేరుగా ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు