Erdogan: మీ భార్య ఎక్కడున్నారు..? ఎలాన్ మస్క్‌కు ఊహించని ప్రశ్న!
తుర్కియే అధ్యక్షుడి నుంచి ఎలాన్ మస్క్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీ సతీమణి ఎక్కడున్నారంటూ ఆయన అడగడంతో.. తాము విడిపోయామంటూ బదులిచ్చారు.
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు ఊహించని ప్రశ్న ఎదురైంది. అదీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ (Erdogan) నుంచి. అమెరికా పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్‌తో మస్క్ భేటీ (Musk- Erdogan Meet) అయ్యారు. ఈ కార్యక్రమానికి మస్క్ తన కుమారుడినీ (X AE A12) తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే యోగక్షేమాలు ఆరా తీసిన ఎర్డోగాన్.. మీ సతీమణి ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నకు మస్క్ బదులిస్తూ.. ఆమె ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నట్లు తెలిపారు. తామిద్దరం విడిపోయామని, అందుకే కుమారుడి సంరక్షణను తానే ఎక్కువగా చూసుకుంటున్నట్లు చెప్పారు.
మస్క్ మరో ప్లాన్.. ట్విటర్‌కు నెల నెలా చెల్లించాల్సిందే!
కెనడాకు చెందిన గాయని గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏఈ ఏ-12, టెక్నో మెకానికస్ అనే కుమారులతోపాటు కుమార్తె ఎక్సా డార్క్ సిడేరియల్ ఉన్నారు. గత సెప్టెంబరులో గ్రిమ్స్, ఎలాన్ మస్క్ విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఈ పిల్లలను విడివిడిగా పెంచుకుంటున్నారు. మరోవైపు మస్క్‌తో సమావేశంలో భాగంగా.. తుర్కియేలో ‘టెస్లా’ కార్ల యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఎర్డోగాన్ ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్‌లింక్ సేవలపై సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మస్క్‌కు తెలియజేసినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఎర్డోగాన్ ప్రతిపాదనలకు మస్క్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్