- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
మణిమేగలైపై దిల్లీ, యూపీల్లో కేసులు
దిల్లీ: మలయాళీ దర్శకురాలు లీనా మణిమేగలై విడుదల చేసిన ‘కాళీ’ (Kaali) పోస్టర్ దేశంలో తాజా వివాదానికి కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. దేవతా మూర్తిని అవమానించేలా ఉన్న ఆ పోస్టర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విటర్ (Twitter) చర్యలు చేపట్టింది. జులై 2న మణిమేగలై పెట్టిన కాళీ పోస్టర్‌ను తొలగించింది. మరోవైపు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదులపై దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మణిమేగలైపై కేసులు నమోదయ్యాయి.
క్షమాపణ చెప్పిన అగా ఖాన్ మ్యూజియం..
ఈ వ్యవహారాన్ని కెనడాలోని భారతీయ హైకమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. రెచ్చ గొట్టేవిధంగా ఉన్న మెటీరియల్‌ను వెంటనే తొలగించాలని కెనడా అధికారులతోపాటు కార్యక్రమ నిర్వాహకులకు సూచించింది. దీనిపై స్పందించిన అగా ఖాన్ మ్యూజియం.. మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. తాజా పరిణామానికి చింతిస్తున్నామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఇదే పోస్టరుకు సంబంధించి.. మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఆమెను అరెస్టు చేయాలని భాజపా నేతలు ఫిర్యాదు చేయడంతోపాటు ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసన చేపట్టారు. వెంటనే ఆమెను తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదిలాఉంటే, తమిళనాడు మధురైకి చెందిన లీనా మణిమేగలై.. ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటో ఉన్న అగాఖాన్ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ ఫొటోను దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో దేవతామూర్తి సిగరెట్ తాగుతూ ఉండడం, బ్యాక్‌గ్రౌండ్‌లో స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా అటు కెనడాలోని హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
-
Politics News
Rajasingh: మునావర్ కామెడీ షో అడ్డుకుంటామన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు
-
World News
Xi and Putin: బాలి సదస్సుకు జిన్‌పింగ్, పుతిన్..!
-
Movies News
Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
DK: ఆ సమయంలో రోహిత్‌పై విమర్శకుల బంతులు దూసుకొచ్చాయి: డీకే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!